Full-Width Version

వరంగల్ స్టూడెంట్ ప్రవలిక ఆత్మఅత్య చాలా బాధాకరం - బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్

ఈ కుటుంబ పాలనలో మరియు గూoడా పాలనలో ఇంకా ఎంత మంది చావులని చూడల్సి వస్తుందో ఏమో అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ వాపోయారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతో మంది యువకులు చాలా ఆశలతో హైదరాబాద్కి డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కోచింగ్ల కోసం వాల తల్లి దండ్రులని కూడా కాదని వారించి ఎలాగో అలాగ డబ్బులు సర్దుకొని వచి కోచింగ్ సెంటర్ లకు మరియు హాస్టల్ లకి ఫీజులు కట్టి రాత్రి పగలు అని తేడా లేకుండా స్టూడెంట్స్ కష్టపడి చదువుకుంటే ఈ చెత్త బీ ఆర్ ఎస్ ప్రభుత్వం గ్రూప్స్ కి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం మళ్ళీ దాని వాయిదా వేయడం వల్ల ఇంకా ఎంత మంది యువకులు మరియు ఎంతమంది కుటుంబాల ఉసురు పోసుకుంటారో అని బీజేపీ మహిళా నాయకురాలు మండి పడ్డారు. ప్రవలిక కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి నీ తెలియజేస్తున్నాను.
ఇలాంటి చావులు ఆగాలంటే ఈ కుటుంబ పాలన పోవాలి.ఈ కుటుంబ పాలన పోవాలంటే వచ్చే ఈ ఎలక్షన్స్ లో ఓట్ల ద్వారా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం కి ప్రజలు బుద్ధి చెప్పాలని జ్యోతి పండాల్ అన్నారు.

Post a Comment

0 Comments