Full-Width Version

మిత్రుల గెలుపు పై ఢిల్లీ వసంత్ హర్షం, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐటి విద్యార్థుల హవా, మోడీ, అమిత్ షాలకు ప్రత్యేక శుభాకాంక్షలు.

@మిత్రుల గెలుపు పై ఢిల్లీ వసంత్ హర్షం
@మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐటి విద్యార్థుల హవా
@మోడీ, అమిత్ షాలకు ప్రత్యేక శుభాకాంక్షలు.

# సుమారు రెండు దశాబ్దాల క్రితం దేశంలో తొలిసారిగా ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ( పూణే) విద్యా సంస్థ, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి కీర్తిశేషులు టి ఎన్ శేషన్ అధ్వర్యంలో ఒక రాజకీయ శిక్షణ సంస్థను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1000 కి పైగా నాయకులను అందించినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీలు కాలేకపోయారు. తొలిసారిగా నేటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎంఐటి విద్యార్థులు ఎమ్మెల్యేగా గెలు పొందారు. ఇందులో ఒకరు నా సహచర విద్యార్థి *హేమంత్ ఓగులే*,  శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి, మరొకరు *సుమిత్ వాంఖడే* , అరవి నియోజకవర్గం నుంచి గెలు పొందారు. దేశంలో చరిత్ర సృష్టించిన నా మిత్రులకు వ్యక్తిగతంగా, జైరాబాద్ నియోజకవర్గం నుంచి, తెలంగాణ ప్రజల తరఫున హార్దిక శుభాకాంక్షలు. మోడీ అమిత్ షాలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. దేశ ప్రజలు బిజెపితో ఉన్నారని మరోసారి నిరూపితమైంది.

Post a Comment

0 Comments