గౌరవ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు మణిక్ రావు గారి సూచనల అనుగుణంగా "BRSV గురుకుల బాట" కార్యక్రమానికి వెళ్తున బి.ఆర్.ఎస్వీ నాయకులను అక్రమంగా కోహీర్ మండలము లోని దిగ్వాల్ గ్రామం లో గల సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు జూనియర్ కళాశాల వద్ద లో BRSV నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కొహిర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సంధర్బంగా విద్యార్థి విభాగం జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు రాకేష్ మరియు విద్యార్థి నాయకులు మట్లాడుతూ అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు అని విద్యార్ధుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు అని అన్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరియైన సదుపాయాలు కల్పించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్లు చరిత్ర లో లేదు అని హితవు పలికారు. విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి మంచి పౌష్టిక ఆహారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్వీ నాయకులు జే .రవి కిరణ్ , బండి మోహన్, ఓంకార్ , శివప్పా , మధు, ప్రణీత్ రెడ్డి, సందీప్ తదితరుల పాల్గొన్నారు.
0 Comments