Full-Width Version

జహీరాబాద్ లో డీసీఎంస్ వారి ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణి కార్యక్రమం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు డీసీఎంఎస్ అధ్వర్యంలో విత్తనాల పంపిణీ.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈరోజు డీసీఎంఎస్ అధ్వర్యంలో విత్తనాల పంపిణీ.
జహీరాబాద్ పట్టణంలోని స్థానిక డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం నందు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ ఆధ్వర్యంలో సోయా, జన్ము లు మరియు జలగలు విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్ తో కలిసి ప్రారంభించరు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సబ్సిడీ మీద అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. దీనిని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు గత ప్రభుత్వల హయంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురు చూసేది అని, ఇప్పుడు బిఅర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి అన్నారు.

Post a Comment

0 Comments