Full-Width Version

నూతన సంస్కరణలతో ఆదర్శవంతమైన పట్టణ ప్రగతి


నూతన సంస్కరణలతో ఆదర్శవంతమైన పట్టణ ప్రగతి
ఎమ్మెల్యే మాణిక్ రావు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జహీరాబాద్ మున్సిపల్ ఆఫీస్ నుండి నిర్వహించిన పారిశుద్ధ్య వాహనాల ర్యాలీని ఎమ్మెల్యే మాణిక్ రావు గారు జెండా ఊపి ప్రారంభించారు.. 
అనంతరం పట్టణ ప్రగతి దినోత్సవం సందర్బంగా జహీరాబాద్ పట్టణంలోని PVR ఫంక్షన్స్ హాల్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే గారిని కోలాటం తో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ ఆలోచనలు, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో తెలంగాణ పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పరిపాలనా సంస్కరణలు, నూతన చట్టాలు, నిరంతరం నిధులతో తెలంగాణ పట్టణాలు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయి అని అన్నారు.

సీఎం కేసీఆర్‌ గారు పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా మన పట్టణాలు నిలుస్తున్నాయి.
మౌలిక వసతుల పెరుగుదల, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తోంది అని అన్నారు.

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి లో బాగంగా నూతనంగా వెజ్ & నాజ్‌వెజ్‌ మార్కెట్లు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు తదితర నిర్మాణాలను చేపట్టింది అన్నారు.

అనంతరం సాఫయి కార్మికులకు సన్మానం చేసి ప్రశంస పత్రాలు పంపిణి చేయడం జరిగింది.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఇంచార్జీ అడిషనల్ DRDO జయదేవ్, మున్సిపల్ కమిషనర్ మల్ల రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మంకళ్ సుభాష్, అల్లాడి నర్సింలు, మురళి కృష్ణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహివుద్దిన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు మోతీరాం, జహంగీర్, అబ్దుల్లా, రాములు నేత, మొహమ్మద్ యూనిస్, బండి మోహన్, మాజీ కో ఆప్షన్ మెంబర్ అక్బర్, సీనియర్ నాయకులు వైజ్యనాత్, ఇజ్రాయేల్ బాబీ, మిథున్ రాజ్, ప్రభు యాదవ్, తుల్సిదాస్ గుప్త, అక్రమ్, హంజా, సమేల్, జాకీర్, ఖదీర్, వహీద్, అలీం అలి, దేవిదాస్, జాఫర్, తేకుమాట్ల గణేష్, కళ్లెం చంద్రయ్య, సంగన్న, వెంకట్ సాగర్, జమీల్, ఆలీం, శివప్ప, పరుశురాం, నాయకులు ఉపేందర్, లావన్, మెప్మ అధికారులు, అర్పి లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments