ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు. పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్‌లో హజ్ యాత్ర చేసేందుకు జహీరాబాద్ నుంచి యాత్రికులు ప్రయాణమవుతున్న వారిలో పట్టణానికి చెందిన యం.పి. జె జిల్లా అధ్యక్షులు యం.డి అయుభ్ ఖాన్ కూడా వెళ్ళుతున్న నేపథ్యంలో... సామజిక ఉద్యమకారులు ఢిల్లీ వసంత్ ఆయన బృంద సభ్యులు డిక్కీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి యల్.
జనార్ధన్, రైతు సంఘం నాయకులు బిల్లిపురం మాధవ్ రెడ్డి, ప్రొఫెసర్ జనార్థన్, మామిడిగి రాజు, రాములు లు హజ్ యాత్రకు వెళ్ళుతున్న అయూభ్ ఖాన్ ని సన్మానించారు, ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ ఏ ఆటంకాలు లేకుండా నిర్విరామంగా హజ్ యాత్ర పూర్తి చేసుకుని రావాలని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఎజాజ్ భాయ్, వహీద్ భాయ్, షబ్బీర్ భాయ్, సత్తార్, అఫ్జల్, యాసర్ ఖాన్, ఇలియాస్ ఖాన్, బన్సి లాల్ చౌహాన్, జహుర్ సాబ్, నయిముల్ల, తదితరులు పాల్గొన్నారు
0 Comments