Full-Width Version

విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణం, గుల్షన్ నగర్ కాలనీలో నిర్వహించిన విద్యా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా *గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు* పాల్గొన్నారు.
అనంతరం మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా 26.06 లక్షల రూపాయల MOMB నిధులతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్ గారితో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావు గారు ప్రారంబించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ సారధ్యంలో నేడు ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చిందన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు వృద్ధిలోకి వచ్చాయి అన్నారు.
మన బస్తి - మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సుందరీకరణ, మరత్తులు మరియు మౌలిక సదుపాయాలు కలోస్తుందన్నరు.
అనంతరం నూతన పాఠశాల యూనిఫాం మరియు నోట్ బుక్కులను ఎమ్మెల్యే గారు విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్పెషల్ ఆఫీసర్ జయదేవ్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దీన్, ఇప్పేపల్లి పిఎసిఎస్ చైర్మన్ దాసరి మచ్చేందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ జాకీర్, మొహమ్మద్ సిరాజ్, కళ్లెం చంద్రయ్య, టేకుమట్ల గణేష్ కళ్లెం రవి, ఎండీ ఇస్మాయిల్, ఎండీ నజీర్ బాబు, కళ్లెం శివ, అధికారులు ఎఇ పిఆర్ కోటేశ్వర్ రావు, ఎంఇవో, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది,విద్యార్థులు మరియుతల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments