Full-Width Version

తెలంగాణ అమరవీరుడు ఇషాంత్ రెడ్డీ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు...

తెలంగాణ అమరవీరుడు  ఇషాంత్ రెడ్డీ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు...

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలి దశ జరిగిన ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అమరుడైన బసంత్ పూర్ ఇషాంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం నియోజకవర్గానికి చెందిన ఇషాంత్ రెడ్డి చేసిన త్యాగం ఎన్నడూ మర్చిపోలేని సంఘటన అని అన్నారు..
ఎందరో వీరుల త్యాగ ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అమరుల ఆశయాల సాధనయే.. తెలంగాణ సంక్షేమ పథకాలని అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల స్పెషల్ ఆఫీసర్ జయదేవ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దిన్, ఇప్పేపల్లి పిఎసిఎస్ చైర్మన్ దాసరి మాచందర్, మొగుడంపల్లి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు బంగారు సురేష్, మాజీ కౌన్సిలర్ బండి మోహన్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, రాంచందర్, వరాలు, సత్యం ముదిరా

Post a Comment

0 Comments