Full-Width Version

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం లోని PVR గార్డెన్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ ప్రగతి వేడుకలను ఘనంగా

నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యుత్ సంబరాలను ప్రారంభించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ*విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని అన్నారు, నిరంతరయంగా సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నదని గుర్తు చేశారు.అటు వ్యవసాయానికి ఇటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారుతెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మూల కారణం విద్యుత్ సౌకర్యమేనేని విద్యుత్ సరఫరా పై తెలంగాణ రాష్ట్రం వెనక్కి తగ్గబోదని ఆయన అన్నారుకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డీ, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మంకల్ సుభాష్, మురళి కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డీ, పాండురంగ రెడ్డీ, వైజ్యానాత్, బాసిత్, న్యాల్కల్ మండల వైస్ ఎంపీపీ గౌసొద్దిన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మాజీ జడ్పీటీసీ మనెమ్మా, PACS ఇప్పేపల్లి చైర్మన్ దాసరి మచ్చందర్, బిఆర్ఎస్ పార్టీ మోగుడంపాల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మొహిఉద్దిన్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు నారాయణ యాదవ్, నర్సింహ రెడ్డీ, విజేందర్ రెడ్డీ, పట్టణ ప్రాదన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు బంగారి సురేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు రాములు నేత, మోతిరాం, అబ్దుల్లా, జహంగీర్, రంగ అరుణ్ కుమార్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, రత్నం, అడిషనల్ DRDO స్పెషల్ ఆఫీసర్ జగదేవ్, ఆయ గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు విద్యుత్ శాఖ అధికారులు AE, DE, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments