ఎమ్మెల్యే గారిని గొల్ల కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
బిసీ సామాజిక వర్గానికి చెందిన కులవృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పైలెట్ ప్రాజెక్టుగా ముగ్గురికి అందజేయడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన కులవత్తుల వారు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష రూపాయల ఆర్థిక సాయం పొందగలరని అన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి వచ్చే నెల 5వ తారీఖు నుండి విడుదలవారీగా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
అనంతరం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొల్లకురుమలకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండవ విడత లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముభరక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ DRDO జయదేవ్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దిన్, ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కిరణ్, బంగారి సురేష్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్, ప్రవీణ్, వెంకటేశం, ఇజ్రాయేల్ బాబీ, అగ్రికల్చర్ ఎడి బిక్షపతి, పశు సంరక్షక శాఖ అధికారులు మరియు ఆయ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments