జహీరాబాద్ ( ) : "చదువుతో పాటు ఆటలు, క్రీడలు కూడ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి చాల దోహదం చేస్తాయి" అని అల్గోల్ మైనార్టీ గురుకులం లో విద్యార్థులకు బాక్సింగ్ కిట్స్ మెటీరియల్ బహుకరణ కార్యక్రమంలో జహీరాబాద్ బీఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ మోహియోద్దీన్ గారు తెలిపారు.
తాను గతంలో ఒక ఫుట్ బాల్ క్రీడకారునిగా ఉండడం వలన క్రీడల పట్ల ఆసక్తీ మరియు అభిరుచి పెరిగిందని చెబుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక మరియు మానసిక వికాసం పెంపొందడంతో పాటు మంచి క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగవచ్చు అని ఆయన అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన బాక్సింగ్ క్రృత్యాలను తిలకించి విద్యార్థులను ప్రశంసించారు మరియు విద్యార్థులకు బాక్సింగ్ కిట్స్ లను బహుకరించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ క్రీడలలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు ప్రిన్స్ పాల్స్ కే.ఎస్.జమీల్ , జే.రాములు, బాక్సింగ్ ట్రైనర్ మరియు కోచ్ మేజర్ మాజిద్ తో పాటు ఇతర బోధన మరియు బోధనేతర సిబ్బందిని మోహియొద్దీన్ గారు అభినందిస్తూ, మైనార్టీ గురుకులాల్లో ఇలాంటి మంచి అవకాశాలను విద్యార్థులకు కల్పిస్తున్నందుకు కార్యదర్శి బి.షఫీఉల్లా, జిల్లా ఇంచార్జ్ నయీముద్దీన్ మరియు ఉమ్మడీ మెదక్ జిల్లా ఆర్.ఎల్.సీ. డాక్టర్ డీ.నర్సింహ్మ, విజిలెన్స్ ఆఫీసర్స్ గౌస్ పాష, ప్రభు వరం గారీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ముర్తుజా, సయ్యద్ మిజ్ బా, స్టాఫ్ నర్స్ లు సోల్మాన్ రాజ్ , ఇమ్రాన్, డిప్యూటీ వార్డెన్ సమీయుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్, సాగర్, పీఈటీ అనిల్, కాజీమ్, ఫిజికల్ డైరక్టర్ మాజిద్, ఎన్.డీ.ఎ ఇంచార్జ్ ఇబ్రాహీం, కో-ఆర్డీనేటర్ డీ. నాగార్జున, జూనియర్ లెక్చరర్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments