Full-Width Version

ఉత్తమ ఎస్ ఐ అవార్డ్ వచ్చిన ఎస్ ఐ శ్రీకాంత్ గారిని సన్మానించిన బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్

జహీరాబాద్: ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎస్ ఐ శ్రీకాంత్ ను ఉత్తమ ఎస్ ఐ గా గుర్తించిన సందర్భంగా ఆయన కు జహీరాబాద్ బిజీపీ మహిళ మోర్చా అసంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ మర్యాద పూర్వకంగా కలసి శాలువా పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో వారు చేస్తున్న కృషి అభినందనియమని అన్నారు. అలాగే మహిళల శాంతి   బద్రతలను కూడా చాలా బాగా కాపాడుతున్నారు అని కొనియాడారు. ఇంకా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా, మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యా నైన కూడా మా దృష్టికి తీసుకువస్తే మేము వెంటనే స్పందించి సపోర్ట్ చేస్తామని  ఎస్ ఐ హామీ కూడా ఇచ్చారు అని జ్యోతి పండాల్ అన్నారు. మహిళ  మోర్చా నాయకురాలు అంజమ్మ , స్వప్న పాటిల్, జర్నలిస్ట్ జగదీష్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments