Full-Width Version

లోక్ అదాలత్ పై న్యాయవాదులతో, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం

లోక్ అదాలత్ పై న్యాయవాదులతో, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం.   
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తేదీన స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో  నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని  సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ  చైర్మన్ శ్రీ కె.సూరికృష్ణ  గారు మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అనూష గారు న్యాయవాదులకు, పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్ లో  నిర్వహించిన సమావేశంలో న్యాయ మూర్తులు మాట్లాడుతూ లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు బాధితులకు, కక్షిదారులకు తెలియజెప్పి రాజిమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం చేసుకొని విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకునేలా చూడాలని తెలిపారు. అలాగే మళ్ళీ అవే కేసులు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. అపరిష్కృతంగా ఉన్న కేసుతో ఎవరైనా  సతమతమౌతుంటే గనక వారు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న న్యాయ సేవా సహాయ కేంద్రాలకు గాని, స్థానిక పోలీసు అధికారులకు గాని, సంబంధిత అడ్వకేట్ ను గాని,  మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని బాధితులకు, కక్షిదారులకు సూచించారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ సాలోమన్, వైస్ ప్రెసిడెంట్ మానెన్న, సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్, డీఎస్పీ రఘు, జహీరాబాద్ టౌన్ మరియు రూరల్ సీఐలు, ఎస్సైలు, పోలీసు  కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, లీగల్ సర్వీసు సిబ్బంది మరియు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments