Full-Width Version

జహీరాబాద్ నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి అయోమయం పట్టించుకోని ప్రభుత్వం - బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి అయోమయం పట్టించుకోని ప్రభుత్వం - బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్
కొన్ని నెలల నుండి మరియు సంవత్సరాల నుండి కూడా మన జహీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది కానీ వాటి గురించి పట్టించుకునే నాధుడే లేడు అని జ్యోతి పండాల్ అన్నారు.
బైపాస్, రంజోల్, పస్తాపుర్,జహీరాబాద్ బస్టాప్ ప్రాంతాలలోనే కాకుండా మహీంద్రా టూ బీదర్ వెళ్ళే రోడ్ లలో కూడా పరిస్థితి చాలా ఘోరంగా వుంది అని వీటి వల్ల ఆక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నారు. వాటివల్ల ప్రజలు చాలా ఇబ్బందులని ఏదురుకావల్సి వస్తుంది అని కావున మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోడ్ ల మర్మమతుల మీద దృష్టి సారించి వాటి సమస్య నీ తీర్చాలని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments