Full-Width Version

వృద్ధుడి పట్ల మానవత్వం చాటుకున్న బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్


సెప్టంబర్ 23వ తేదీన గురుతు తెలియని ఒక వృద్దుడు రోడ్ పైన పడి వుండడం చూసి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్త గారు చేర్పించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి పండాల్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ వృద్దుడి ఆరోగ్య పరిస్తితి గురించి నైట్ డ్యూటీ డాక్టర్నీ అడిగి తెలుసుకున్నారు. అతనికి తినడానికి సరిగా ఆహారం లేక రక్తం లేకపోవడం మరియు అసిడిటీ బాగా పెరిగిపోవడం వల్ల పరిస్థితి కొంచం క్రిటికల్ గా వుండే. మన ఏరియా హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం వల్ల హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి తొందరగా బ్లడ్ తేపించి రెండు సార్లు బ్లడ్ ట్రాన్స్ఫుజన్ చేయించారు. బ్లడ్ తేపించి అతనికి ట్రీట్మెంట్ జరిగేంతవరకు జ్యోతి పండాల్ హాస్పిటల్ సిబ్బంది తో ఫాలో అప్ చేస్తూ అతనికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్లడ్ ట్రాన్స్ఫుజన్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు ఆ వృద్ధుడి కి ఒక బ్లాంకెట్ ఇచ్చి అతనితో కాసేపు ముచ్చటించి అతని ఆరోగ్యం మెరుగు పడే వరకు అతనితో సపోర్ట్ గ నిలిచింది జ్యోతి పండాల్.

Post a Comment

0 Comments