Full-Width Version

తపస్య జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక తపస్య జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీ సూరి కృష్ణ గారు నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
 న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, చదువుపై శ్రద్ధ వహించి లక్షాలను అధిరోహించాలని, సమయ పాలన పాటించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోక్సో చట్టం, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులు సరైన వయసు వచ్చేవరకు వాహనాలు నడపకూడదని, ఒకవేళ పై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు. బాల్య వివాహా బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే స్థానిక తహసీల్దార్ లేదా స్థానిక పోలీస్ అధికారికి లేదా మండల లీగల్ సర్వీసెస్ కార్యాలయంలో గాని లేదా 1098 కి ఫోన్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యాంగా ఉంచబడతాయని తెలియజేసారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, బార్ సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్, న్యాయవాదులు సోమశేఖర్, గురురాజ్ కులకర్ణి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments