Full-Width Version

జహీరాబాద్ లో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటుకు కృషి

• జహీరాబాద్ లో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటుకు కృషి

• నిరుద్యోగ నిర్ములనకు ప్రత్యేక కార్యచరణ
• మొదటి ప్రధాన్యత ఓటు వేసిభారీ మెజారిటీ తో గెలిపించండి

జహిరాబాద్:- పారిశ్రామిక ప్రాంతమైన జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని కరీంనగర్- అదిలాబాద్ నిజామాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. శుక్రవారం జహీరాబాద్ పట్టణ కేంద్రంలో పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు.. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ టు పీజీ వరకు అన్ని రంగాలపై అవగాహన ఉన్న తనను రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు... విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు..  విద్యారంగం నుండి వచ్చిన తనకు ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని.. నిరుద్యోగ నిర్మూలనకు  ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నానని వెల్లడించారు...గతంలో గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు... వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో చాలావరకు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని అన్నారు... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 50వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం కింద ప్రభుత్వ కళాశాలలో పరీక్ష ఫీజులు వసూలు చేయడం బాధాకరమని అన్నారు.. గురుకుల, మోడల్, కేజిబివి లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరుకై కృషి చేస్తానని అన్నారు.. ప్రభుత్వ గురుకులాలలో కీచన్, మెస్,కేర్ టేకర్ సిస్టం నుసఫరెట్ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలనిఅన్నారు.. గత 11 రోజులుగా సర్వ శిక్ష అభియాన్  తమ న్యాయమైన డిమాండ్ల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారని.. త్వరలోనే వారికి ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు... 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని  ప్రభుత్వం వెంటనే వారి స్థానికతను బట్టి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు..  రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు 

Post a Comment

0 Comments