ఇటీ వల కాలం లో నేను ఒక స్టూడెంట్ నీ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో చేరిపిoచడానికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రాసెస్ గురుంచి మాట్లాడినప్పుడు స్కాలర్షిప్ గురుంచి మాట్లాడితే కొన్ని కాలేజెస్ లో ఎస్ సీ, ఎస్ టీ స్టూడెంట్స్ కి మాత్రమే స్కాలర్షిప్స్ అందుతున్నాయి అని మరి కొన్ని కాలేజెస్స్ లో బీ సీ స్టూడెంట్స్ కి మాత్రమే అందుతున్నాయి అని సంబంధిత కలశాల యాజమాన్యం వాపోతున్నారు. అన్ని వర్గాల స్టూడెంట్స్ అందరికి స్కాలర్షిప్స్ రెండు సంవత్సరాల నుండి అందడం లేదు అని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. దీనివల్ల కొన్ని కాలేజెస్ లో స్కాలర్షిప్ పైన జాయిన్ చేసుకోకపోవడం వల్ల తల్లి దండ్రులకు పిల్లల ఫీజులు మొత్తం కట్టాలంటే చాలా భారంగా మారింది అని జ్యోతి పండాల్ అన్నారు. కొన్ని కాలేజెస్స్ లో స్కాలర్షిప్స్ వస్తాయి అన్న నమ్మకంతో స్టూడెంట్స్ నీ జాయిన్ చేసుకుంటే ఆ సంబంధిత కాలేజ్ యాజ్యమన్యనికి నష్టం వస్తుంది అని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు వాపోతున్నారు. స్కాలర్షిప్స్ రాకపోవడం వల్ల ఇటు తల్లిదండ్రులు అటు కాలేజ్ ల యజ్యమాన్యలు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. కావున మన లోకల్ ఎమ్మెల్యే గారు ఈ విషయం లో కలిపించికొని రాష్ట్ర నాయకులతో మాట్లాడి వెంటేనే మన జహీరాబాద్ నియోజకవర్గం స్టూడెంట్స్ నీ ఆదుకోవాలని జ్యోతి పండాల్ డిమాండ్ చేశారు.
0 Comments