Full-Width Version

ఈనెల (07.10.2023) తేది నాడు గౌరవ ఆర్థిక, ఆరోగ్య మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు

 జహీరాబాద్ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేస్తున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు మంత్రి గారి పర్యటనకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 
ఆలాగే మంత్రి గారి హెలికాప్టర్ లాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్, పర్యంటించబోయే రూట్ మ్యాప్ ను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర బీవీరైజర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గార్లు పోలీస్ అధికారులకు వివరించడం జరిగింది.
అనంతరం హాతి కే లోని 2BHK ఇండ్ల దగ్గర నిర్వహించే సభ స్థలాన్ని మరియు బాగా రెడ్డి స్టేడియంలో నిర్వహించే సభ కోసం ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటరెడ్డీ, బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహిఉద్దిన్, న్యాల్కల్ మండల అధ్యక్షుడు రవీందర్, కొహీర్ సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కిరణ్, మాజీ కౌన్సిలర్ బండి మోహన్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments