Full-Width Version

అల్గోల్ మైనారిటీ గురుకులంలో ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ వేడుకలు

జహీరాబాద్ (  ) :   "మాతృ భాష తేనే కంటే తియ్యనిది,  భాష లేనిదే సమాజంలో మానవుని మనుగడ లేదు" అని అల్గోల్ మైనారిటీ బాలుర గురుకులంలో ఘనంగా జరిగిన  అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ వేడుకల్లో ముఖ్య అథితిగా విచ్చేసిన శ్రామిక విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ నిర్వాహకులు డాక్టర్ విజయ లక్ష్మీ తెలిపారు. మాతృభాష   పట్ల ఆసక్తి,  అవగాహన పెంచాల్సిన ఆవశ్యకతతో పాటు మాతృభాషను పరిరక్షించే బాధ్యత  ప్రతి ఒక్కరి పైన ఉన్నదని ఆమె అన్నారు.  ఈ సందర్భంగా తాను మాట్లాడుతు మాతృభాష లో వివిధ రకాలైన మంచి పుస్తకాలను చదవాలని   రీడింగ్ క్లబ్ మరియు సైన్స్ క్లబ్ ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ జే.  రాములు, కే.ఎస్.జమీల్, కోఆర్డీనేటర్లు రహీం, నాగర్జున, శ్రీనివాస్, సమీయుద్దీన్, ఇర్ఫాన్,   ఉపాధ్యాయినీ,  ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments